కోయంబత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం – ఐదుగురు దుర్మరణం

0
302

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
రోడ్డు ప్రమాదంలో మహిళతో సహా ఐదుగురు దుర్మరణం పాలైన విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన కారు, తమిళనాడుకు చెందిన లారీ పాలక్కాడ్‌-సాలెం రహదారిపై శనివారం ఉదయం ఢీకొన్నాయి.

ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతిచెందారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కారు డ్రైవర్‌ మహ్మద్‌ బషీర్‌ ఒడిశాకు చెందిన వలస కూలీలను తీసుకువెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.శవపరీక్ష నిమిత్తం మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించారు.తిరుచ్చివాసి అయిన లారీ డ్రైవర్‌ సతీస్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.