తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు

0
411

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
చిరుధాన్యాలతో పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చని,వాటిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయని పలువురు వక్తలు అన్నారు.తృణధాన్యాలు కొత్తగా వచ్చినవి కాదని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలని వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు.

మనిషి ఆరోగ్యం వారి ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని,ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో పాశ్య్చాత్య ఆహారపు అలవాట్లు విపరీతంగా పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఆ కారణంగానే ప్రజల్లో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని వాపోయారు. చిరుధాన్యాల్లో మనిషికి కావాల్సిన పూర్తిస్థాయి పోషక విలువలున్నట్లు తెలిపారు.

నేడు పసిపిల్లల దగ్గర నుంచే మధుమేహం, బీపీ వంటి రోగాలు వస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లేనన్నారు.పూర్వీకులు అందించిన చిరు ధాన్యాల ను తిరిగి మనం వినియోగించి భవిష్యత్‌తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని వక్తలు కోరారు.ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో చిరుధాన్యాలనే శరణ్యమన్నారు.