జపాన్‌ ఓపెన్‌ నుండి కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమణ

0
49

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ మరోసారి నిరాశపరిచాడు. జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ను అన్‌సీడ్‌ ప్రణయ్‌ 13-21, 21-11, 21-20 తేడాతో మట్టి కరిపించాడు.

తొలిగేమ్‌లో ప్రణయ్‌పై శ్రీకాంత్‌ ఆధిపత్యం చెలాయించాడు.కానీ రెండోగేమ్‌లో ప్రణయ్‌ పుంజుకోని తిరిగి రేసులో నిలిచాడు.నిర్ణయాత్మకమైన మూడోగేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. 20-18తో ప్రణయ్‌ ఆధిక్యంలో ఉన్నా శ్రీకాంత్‌ పోరాడి 20-20తో స్కోరుని సమం చేశాడు.

కానీ చివరికి ప్రణయ్‌ పైచేయి సాధించాడు. గాయం నుంచి తిరిగి కోలుకుని బరిలోకి అడుగుపెట్టిన ప్రణయ్‌ రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్‌మస్ జెమ్కేతో తలపడనున్నాడు.ఇండోనేషియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఇంటి దారి పట్టిన శ్రీకాంత్ జపాన్‌ ఓపెన్‌లో తొలిరౌండ్‌లోనే విఫలమవ్వడం గమనార్హం.