కర్నాటకంలో కొనసాగుతున్న నాటకీయం

0
259

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
కర్ణాటక రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.నిన్న సంకీర్ణ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా రాత్రి 11 గంటల వరకు సభను కొనసాగించారు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌.అయితే ఈవాళ సాయంత్రం 4 గంటలలోపు బలాన్ని నిరూపించుకోవాలని కుమారస్వామి ప్రభుత్వానికి స్పీకర్‌ డెడ్‌లైన్‌ విధించారు.

ఇకపోతే రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు.మీరే స్వయంగా కలిసి వివరణ ఇవ్వాలని కోరగా,తాము స్పీకర్‌ నోటీసులకు స్పందించమని న్యాయనిపుణులతో సమావేశమైన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు.అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌ తమ రెబల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం ఉదయం విధానసభకు మొత్తం 205 మంది ఎమ్మెల్యేలు హాజర య్యారు.

ఇప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 103 కాగా వీరిలో 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 100 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది.ఇదిలా ఉండగా తమకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ.. స్పీకర్‌ రమేశ్‌కు మంగళవారం అసమ్మతి ఎమ్మెల్యేలు లేఖ రాశారు. సభలో సిద్ధరామయ్య ఇచ్చిన అనర్హత పిటిషన్‌ కాపీలు తమకు ఇంకా అందలేదని అందులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్‌ విషయంలో సదరు సభ్యులకు కనీసం ఏడు రోజుల సమయం ఇవ్వాలన్నారు.

గతంలో సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని వివరించారు. కానీ, అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రక్రియను వేగవంతం చేశారన్నారు.ఈ నేపథ్యంలో తమకు మరో 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు.దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ ఇదంతా కోర్టు పరిధిలోని అంశమని ఈ విషయాన్ని వారు కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.