ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారత క్రికెట్‌ కోహినూర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌కు సముచిత గౌరవం దక్కింది.అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది.ఐసీసీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

లండన్‌లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమంలో సచిన్‌ పాల్గొని మాట్లాడారు.తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తు న్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ అని ఐసీసీ కొనియాడింది.

లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించామని ఐసీసీ ట్వీట్‌ చేసింది.ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్దనే సచిన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు.అందుకు సంబంధించిన వీడియో సైతం ఐసీసీ విడుదల చేసింది.