రాష్ట్ర పురపాలక చట్టం-2019ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

0
9
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం – 2019 బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు బిల్లుపై సవరణలు స్వీకరించనుంది ప్రభుత్వం.ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.

తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(సవరణ)బిల్లు, బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరి మితి పెంపు బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు.తెలంగాణ పంచాయతీరాజ్(సవరణ) బిల్లు, తెలంగాణ రుణవిమోచన కమిషన్ బిల్లును మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.