తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం – 10 మంది దుర్మరణం

0
41

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘరరోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. ఓ ప్రైవేటు బస్సు విల్లుపురం జిల్లా కల్లాకుర్చి వద్దకు చేరుకోగానే జార్ఖండ్‌కు చెందిన కార్మికులతో ప్రయాణిస్తున్న మరో ట్రక్కును ఢీకొంది.

దీంతో కల్లకుర్చి-సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీ సుల కథనం ప్రకారం ట్రక్కులో మొత్తం 14 మంది కూలీలు ఉన్నారు.వీరిలో 11 మంది జార్ఖండ్‌ ప్రాంతా నికి చెందినవారు.వీరంతా కాంచీపురం జిల్లా నుంచి తిరుపూర్‌ జిల్లాలో విద్యుత్తు పంపిణీ లైన్ల ఏర్పాటు కు బయల్దేరి వెళుతున్నారు.

మృతిచెందిన వారిలో మదురైకి చెందిన ట్రక్కు డ్రైవర్‌ ఎం.మణికండన్‌, తిరునైవేలికి చెందిన బస్సు డ్రైవర్‌ ఎ.రాజేంద్రన్‌ కూడా ఉన్నారు.మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు.