ఉత్కంఠతను రేపుతున్న కర్నాటక రాజకీయం – విశ్వాసపరీక్షపై చర్చ

0
46

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
కర్ణాటక రాజకీయం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.నేడు ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించనున్నట్లు స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ నిర్ణయించిన సంగతి విదితమే.దీనికి సంబంధించిన విశ్వాసపరీక్షను ప్రవేశపెట్టారు.దీనిపై చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింద న్నారు.ఏదేమైనప్పటికీ తాము రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామన్నారు.బీజేపీ అండతోనే రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారని ఆయన ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు.కాగా రెబల్‌ ఎమ్మెల్యేలు 15 మంది సభకు హాజరుకాలేదు.అయితే బలపరీక్ష వాయిదా పడే అవకాశాలు కనిపి స్తున్నాయి.రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే కారణం.