బి.కొత్తకోట తహశీల్ధార్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.వి.సుబ్బన్న

0
52

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండల నూతన తహశీల్ధార్‌గా సి.వి.సుబ్బన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఏర్పేడు మండల తహశీల్ధార్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.ఇందు కోసం తోటి అధికారులు, సిబ్బంది సహాయసహకారాలు తీసుకుంటామన్నారు.

ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా కార్యాలయానికి వచ్చి తెలియపరచాలని, తద్వారా వాటిని వెంటనే సంబంధిత వీఆర్వోల ద్వారా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.నూతన తహశీల్ధార్‌ సి.వి. సుబ్బన్నకు పలువురు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ కార్యాలయపు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.