బిందు,తుంపర్ల సేద్యంతో అధిక లాభాలు – మదనపల్లె ఏరియా అధికారిణి శ్రీదేవి

0
57

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
రైతు సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మదనపల్లె మండలం మైక్రో ఇరిగేషన్ ఏరియా అధికారిని శ్రీమతి శ్రీదేవి పేర్కొన్నారు.బుధవారం ఉదయం మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ, దొన బైలు గ్రామం నందు రైతు పొలం లో మైక్రో ఇరిగేషన్ పరికరాలు వాడకం, బిందు సేద్యం ద్వారా ఉపయో గాలు అనే అంశాలపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన, వ్యవసాయ పంటలసాగులో సాగు నీటి యాజమాన్యం చాలా ప్రధానమైనది.

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, సకాలంలో కురవని వర్షాలు, సాగునీటి నిర్వహణ ప్రాముఖ్యతను పెంచాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.సాగునీటి వనరులను సద్వినియోగానికి బిందు సేద్యం,తుంపర్ల సేద్యం, రెయిన్ గన్లు మాత్రమే రైతులకు ప్రత్యామ్నేయ మార్గాలు అన్నారు.ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడకపోవడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు,బావులు ఎండిపోయిన నేపద్యంలో రైతులు ఉన్న నీటిని పొదుపుగా వాడుకొనుటకు సాగునీటి యాజమాన్య పద్దతులు పాటించాలని తెలిపారు.

రైతులకు ఉన్న నీటితోనే అధిక విస్తీర్ణంలో అధిక దిగుబడులు, నాణ్యమైన అధిక లాభం పొందవచ్చ న్నారు.ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకొనుటకు రైతాంగం ముందుకు రావాలని రైతులకు సూచించారు.అందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి యాజమాన్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు. మైక్రో ఇరిగేషన్ పరికరాలు ఉపయోగించుకోవడం వల్ల 50 శాతం నుండి 60 శాతం వరకు నీటిని ఆదా చేసుకోవచ్చని,49 శాతం నుండి 54 శాతం వరకు విద్యుత్ ఆదా చేసుకో వచ్చని,25 నుండి 35 శాతం వరకు వ్యవసాయ కూలీ ఖర్చులు తగ్గుతాయని,70నుండి 80 శాతం వరకు ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గించుకోవచ్చని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 5 ఎకరాల లోపు పొలం ఉన్న ఎస్.సి, ఎస్.టి రైతులకు 100 శాతం రాయతీ, ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న సన్నకారు మరియు చిన్న కారు రైతులకు 90 శాతం,ఐదు నుండి పది ఎకరాల లోపు గల మధ్య తరగతి రైతులకు 90 శాతం,పది ఎకరాలు పైన పొలం కలిగిన రైతులకు 50 శాతం ప్రభుత్వం రైతులకు రాయతీపై డ్రిప్ పరికరములను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ రాయతీపై మైక్రో ఇరిగేషన్ పరికరాలు పొందుటకు అర్హులైన రైతులు బయోమెట్రిక్ ద్వారా మీ సమీపంలో ఉన్న మీ-సేవ కేంద్రాలలో మైక్రో ఇరిగేషన్ కంపెనీ/ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాలలో ఆధార్ కార్డు,తహసిల్దారుచే ధ్రువీకరించబడిన భూమి 1-బి రికార్డు, భూమి వెబ్ సైట్ సమాచారం,పాస్ పోర్ట్ సైజు ఫోటో,రేషన్ కార్డు,ఎస్.సి,ఎస్.టి రైతులైతే కుల ధృవీకరణ పత్రాలను దరకాస్తుతో పాటు జతపరిచి సమర్పించుకోలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పనిచేయుచున్న మైక్రో ఇరిగేషన్ కంపెనీలలో రైతులకు నచ్చిన కంపెనీలు ఎంపిక చేసుకోవచ్చని కంపెనీల ఎంపికలో రైతులకు పూర్తి స్వేఛ్చ కలదన్నారు.

2014-15 సంవత్సరముకు ముందు ప్రభుత్వ రాయతీతో డ్రిప్ పరికరాలు అమర్చుకొన్న,ఇప్పుడు డ్రిప్ యూనిట్ నాణ్యత దెబ్బతిన్న పరికరాలు మార్చుకొనుటకు గాను 50 శాతం రాయతీతో క్షేత్ర స్థాయిలో అవసరం మేరకు లెటరల్ పైపులు, వెంచురీ, మరియు ఫిల్టర్లు, హెడ్ కంట్రోల్ యూనిట్ లు మార్చుకొనుటకు అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిరాం కంపనీ, మైక్రో ఇరిగేషన్ కంపెనీలు, సాంకేతిక నిపుణులు, మైక్రో ఇరిగేషన్ పరికరాలు వినియోగం, వాటిని ఎలా పొందాలనే అంశాలపై రైతులకు అవగాహన కలిగించారు.

ఈ సదస్సులో రైతులు డ్రిప్ పరికరాల వినియోగించుట లోను డ్రిప్ పరికరాలు పొందుటలో ఉన్న సమస్యలను తెలపగా రైతులకు అర్థమైన రీతిలో వారికి సమాధానం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎం.ఐపి ఏ.పి.డి మురళి మోహన్ రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారిని ఉమాదేవి,మన గ్రోమోర్ పవన్, ఏ.టి.ఎం కాలవతి, సాయి రాం కంపెనీ ప్రతినిధులు నాగేంద్ర,గురు,శంకరప్ప,ఇతర కంపనీల ప్రతినిదులు, రైతులు పాల్గొన్నారు.