తిరుపతి డి.ఎల్.పి.ఓగా సయ్యద్ ఖాదర్ బాష నియామకం

0
135

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా తిరుపతి డివిజనల్ పంచాయతీ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి కార్యలయం పరిపాలన అధికారిగా పనిచేస్తున్న సయ్యద్ ఖాదర్ భాషను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే ఆయనకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఇక్కడ నుంచి ఆదోని డి.ఎల్.పి.ఓ గా బదిలీపై వెళ్లుతున్న సురేష్ నాయుడును కలెక్టర్ ఆదేశించారు.. దీంతో ఎ.ఓ. ఖాదర్ బాష తిరుపతి డి.ఎల్.పి.ఓగా జాయిన్ అయ్యారు. సయ్యద్ ఖాదర్ భాష కడప జిల్లాలో గతంలో ఇన్-చార్జీ డి.పి.ఓగా,డిప్యూటి సి.ఇ.ఓగా, కడప, చిత్తూరు జిల్లాలో జిల్లా మైనార్టీ అధికారిగా పనిచేశారు. చురుకైన అధికారిగా గతంలో ఖాదర్ భాష రాష్ట్ర స్థాయి, జిల్లా ఉన్నతాధికారుల మన్ననలు అందుకొన్నారు.