అమెరికాను వణికిస్తున్న ‘బ్యారీ’ తుఫాన్‌ – నీట మునిగిన లూసియానా

0
91

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
బ్యారీ తుఫాన్‌తో అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది.భారీవర్షాల ధాటికి పోటెత్తిన వరదలతో లూసియా నా రాష్ట్రం నీట మునిగిపోయింది.ఈ తుఫాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన సంగతి విదితమే.ఈ తుఫాన్‌ ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.కనీవినీ ఎరుగని రీతిలో నష్టం వాటి ల్లింది.

ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.పలు కార్యాలయాలు మూత పడ్డాయి.ఉద్యోగస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు.రవాణా వ్యవస్థతోపాటు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.అమెరికన్‌ ఆర్మీ చురుగ్గా సహాయక చర్యలు చేపట్టింది.వరద నీటిలో చిక్కు కున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.