వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ నియామకం

0
7
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) తొలి ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.

2016 లో వీఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఛైర్మన్‌ నియామకం జరగడం ఇదే తొలిసారి. ద్రోణం రాజు శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూశారు.గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా కూడా పని చేశారు.

ఇప్పటి వరకు వీఎంఆర్‌డీఏ తాత్కాలిక ఛైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి వ్యవహరించే వారు.ఛైర్మన్ నియామకం జరగడంతో ఇతర డైరక్టర్ల నియామకం కూడా త్వరలో జరుగుతుందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి.