మదనపల్లెలో ముమ్మరంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

0
48
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్‌,బీజేపీ నాయకుడు జర్మన్‌ రాజు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని అప్పారావు వీధి, ఆర్‌ఆర్‌ వీధుల్లో సభ్యత్వ నమోదును నిర్వహించారు.

చాలా మంది యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.ఈ సంద ర్భంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భారతదేశం అన్నిరంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదన్నారు.ఆయన ప్రవేశపెట్టిన పథకాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారన్నారు.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.ఇకపోతే మదనపల్లె డివిజన్‌లో వీలైనంత ఎక్కువ మొత్తంలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.