భారీ వర్షాలకు అసోం అతలాకుతలం – జలమయమైన 800 గ్రామాలు

0
56
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
గత నాలుగురోజుఉగా కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి అసోం రాష్ట్రం అతలాకుతలమైంది.లోతట్టు ప్రాంతలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.బ్రహ్మపుత్రనది ఉగ్రరూపం దాల్చింది.ఇకపోతే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌,అసోం రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల ధాటికి సుమారు 800 గ్రామాలు జలమయమయ్యాయి.

దాదాపు 8 లక్షల మందికిపైగా ప్రజు నిర్వాసితులయ్యారు.పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడు తున్నాయి.అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో అమరనాథ్‌ యాత్రకు వెళ్తున్న 800 మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకున్నారు.

అమరనాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వర్షబీభత్సానికి తల్లడిల్లిపోతున్నాయి.నదులు,కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.మరికొన్ని ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.భారత సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.