
మనఛానల్ న్యూస్ – తిరుమల
కలియుగ ప్రత్యక్షదైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈనెల 15న చంద్రయాన్-2ను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం చంద్రయాన్-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగ నాయకుల మండపంలో పండితులు శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కాగా సోమవారం (జులై 15)న వేకువజామున 2.51న నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుండి ప్రయోగించనున్నారు.ఈ ప్రయోగాన్ని తిలకించడానికి భారత రాష్ట్రపతి రేపు సాయంత్రం రాష్ట్రానికి విచ్చేయనున్నారు.