డయాబెటిస్‌కు చక్కటి విరుగుడు నిమ్మరసం

0
119

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
నిమ్మకాయ డయాబెటిస్‌కు చక్కటి విరుగుడుగా దోహదపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం తినే ఏ వంటకంలోనైనా నిమ్మరసం పిండితే ఆ వంటకానికి చక్కని రుచి వస్తుంది.అలాగే నిమ్మ కాయ వాసన చూస్తే తాజాదనపు అనుభూతి కలుగుతుంది.దీంతోపాటు నిమ్మరసం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం నిమ్మకాయలను రోజూ వాడాలి.

రోజూ నిమ్మరసాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

  • నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది. విటమిన్ సి ఉన్న నిమ్మరసం మాత్రమే కాకుండా ఇతర ఆహారాలను కూడా తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
  • ఒక మీడియం సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మనకు నిత్యం కావల్సిన ఫైబర్‌లో ఇది 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా అవసరం ఉండదు. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే లో బీపీ ఉండే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
  • డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసం తాగడం వల్ల అందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
  • డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది.