ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు పృథ్వీరాజ్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఈ విషయాన్ని పృథ్వీకి తెలియజేశారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ఆయనతో కలిసి పృథ్వీరాజ్ నడిచారు.అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ గెలుపునకు అలుపెరగని కృషి చేశారు.పార్టీ కోసం పనిచేసిన పృథ్వీరాజ్ కి సీఎం వై.ఎస్‌.జగన్‌ సముచిత స్థానం కల్పించారని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

ఇదిలా ఉండగా టీడీపి ప్రభుత్వ హయాంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఎస్వీబీసీ చైర్మన్‌గా వ్యవ హరించిన సంగతి విదితమే.అయితే మేలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఆ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.