ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న భారీవర్షాలు – 15 మంది మృతి

0
60
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
భారీవర్షాలకు ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు,ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. గత మూడురోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలకు 15 మంది మృతి చెందారు. భారీగా జంతు, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం ప్రభావం వల్ల 133 భవనాలు నేలకూలాయి.

ఉన్నావూ, అంబేడ్కర్‌ నగర్‌, గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, హర్దోయ్‌, కాన్పూర్‌ నగర్‌, పిలిభిట్‌, సోనాభద్ర, చందోలి, ఫిరోజాబాద్‌, మావూ, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం నుంచి మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

యూపీతో పాటు ఉత్తరాఖండ్‌, తూర్పు యూపీ, ఝార్ఖండ్‌, మధ్య మహారాష్ట్ర, కొంకణీతీరం,గోవా, కర్ణాటకలోని తీర ప్రాంతాలు,అరుణాచల్‌ ప్రదేశ్‌,నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురలో శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.