సాయంత్రంలోగా స్పీకర్‌ను కలవండి – కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీం సూచన

0
50
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
రాజీనామాలు చేసిన 10 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం 6 గంటల లోగా స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను కలవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ముంబయిలోని ఓ హోటల్‌లో బసచేస్తున్న సంగతి విదితమే.

అయితే కాంగ్రెస్‌ మంత్రి జేడీ శివకుమార్‌ వారిని బుజ్జగించేందుకు నిన్న ముంబయి చేరుకున్నారు.కాగా తమ రాజీనామాలపై స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంలో పిటిషన్‌ వేశారు.

దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం రాజీనామాలపై స్పీకర్‌ను కలవాలని ఆదేశించింది.అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.