వాడీ వేడీగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి.తొలిరోజే పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘0’’ వడ్డీకే రుణాలు అనే పథకం ఇప్పటిది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి 2013లోనే ప్రవేశపెట్టారని, అదే ఇప్పటి వరకు కొనసాగుతున్నదన్నారు.

దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ 2014 నుండి 2019 వరకు ఎంతమంది రైతులకు ‘‘0’’ వడ్డీకి రుణాలు అందించారో తెలపాలని సవాల్‌ విసిరారు.ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు కలుగజేసుకొని నా రాజకీయ అనుభవమంతా వయస్సు ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉంటుందని కౌంటర్‌ ఇచ్చాడు.

దీనిపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ ఎన్నిసంవత్సరాలు ఇండస్ట్రీ ముఖ్యం కాదని బుల్లెట్‌ దిగిందా లేదా అనేది ముఖ్యమని సినిమా డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.ఇక మరోమంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ చరిత్రల గురించి అవసరం లేదని, ప్రతిపక్ష సభ్యుల చరిత్ర మాకు తెలుసునని చెప్పుకొచ్చారు.