రాయలసీమ జోన్ లో డి.ఎల్.పి.ఓలు బదిలీలు

0
394
advertisment

మనఛానల్ న్యూస్ -అమరావతి
రాయలసీమలోని పలువురు డి.ఎల్.పి.ఓలను (డివిజనల్ పంచాయతీ ఆఫీసర్) బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • రాజంపేట డి.ఎల్.పి.ఓగా పనిచేస్తున్న టి.రమణను అనంతపురం డివిజనల్ పంచాయతీ అధికారిగా బదిలీ చేశారు.
  • ఆదోని డి.ఎల్.పి.ఓ గా పనిచేస్తున్న తిమ్మక్క ను కర్నూలు డివిజనల్ పంచాయతీ అదికారిగా నియమించారు.
  • కర్నూలు డివిజనల్ పంచాయతీ అధికారి పని చేస్తున్న విజయకుమార్ ను అనంతపురం జిల్లా పెనుగొండ డివిజనల్ పంచాయతీ అధికారిగా బదిలీ చేశారు.
  • కర్నూలు జిల్లా నంద్యాల డి.ఎల్.పి.ఓ గా పనిచేస్తున్న బి.పార్వతిని అనంతపురం జిల్లా ధర్మవరం డి.ఎల్.పి.ఓగా నియమించారు.
  • పెనుగొండ డి.ఎల్.పి.ఓ గా పనిచేస్తున్న శ్రీనివాసులు ను నంద్యాల డి.ఎల్.పి.గా నియమించారు.
  • చిత్తూరు డి.ఎల్.పి.ఓగా పనిచేస్తున్న బి.సురేష్ నాయుడును ఆదోని డి.ఎల్.పి.ఓగా నియమించారు.