‘‘గాంధీయన్‌ యంగ్‌ టెక్నాలాజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు’’ను అందుకున్న మిట్స్‌ విద్యార్థి

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండం అంగళ్లు సమీపంలోని మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల) నందు బీ.టెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న బి.మల్లికార్జున రెడ్డి జాతీయస్థాయిలో ప్రతిభ కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.

భారతదేశ రాజదాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనీషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇనిస్టిట్యూషన్స్ (ఎస్‌ఆర్‌ఐఎస్‌టిఐ) వారు నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో బోరెడ్డి మల్లికార్జున రెడ్డి ‘‘గాంధీయన్ యంగ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డు’’ను అందుకున్నట్లు ఆయన అన్నారు. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన అన్నారు.

జాతీయస్థాయిలో యువ శాస్త్రవేత్తలు వారు చేసిన అత్యుత్తమ పరిశోధనలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించి వివరించినందుకుగాను ఈ అవార్డు విద్యార్థికి దక్కిందని ఆయన అన్నారు.(డెవలపింగ్ ల్యాబ్ స్కేల్ మాగ్నెటో మెకానికల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ తో ప్రెడిక్ట్ ది ప్లేక్యూ గ్రోత్ అఫ్ హ్యూమన్ హార్ట్ కరోనరీ ఆర్టెరీల్ లేయర్ సిస్టం) అనే అంశం చేసిన పరిశోధనకుగాను ఈ అవార్డుకు ఈ విద్యార్ధి ని ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు.

మన భారతదేశంలో,పురుషులలో ఆరుగురిలో ఒకరు మరియు స్త్రీలలో పదిమంది ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నారు.మరణాల రేటు రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.ప్రస్తుత అంచనాల ప్రకారం, ప్రపంచం మొత్తంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.ఇండియన్ హార్ట్ అసోసియేషన్ అంకెల ప్రకారంగా భారతీయులలో మొత్తం గుండెపోటులలో 50% వరకు 50 ఏళ్లలోపు ఉండే వారికి, మరియు 25% 40 ఏళ్ల వయసు వారికి సంభవిస్తుంది.

గుండె జబ్బులకు ప్రధాన కారణం గుండె ధమని పొరలలో (క్రొవ్వు పదార్ధం) ఉన్న ఫలకం పెరగడం వల్లనే.ఇది మన గుండెలో పెరుగుతున్న ధమని పొరల వల్ల గుండె జబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. గుండెలో గల ఈ పదార్థాన్ని ఎంత శాతం ఉందొ కనుగొనుటకు మల్లికార్జున రెడ్డి మరియు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.జి.మల్లికార్జున చారిలు బయో మెడికల్ రంగంలో ఒక నూతన పరికరాన్ని కళాశాలలో కనుగొనడం జరిగిందని ప్రిన్సిపాల్ అన్నారు.

advertisment

ఈ పరికరం ద్వారా మన గుండెలో ఎంతశాతం పెరిగిందో తెలుసుకొని దానికి సంబంధించిన చికిత్సను చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులను తగ్గించుటకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు.ఈ పరికరాన్ని తయారు చేయుటకు సుమారు ఒక లక్ష యాభై వేలు అయిందని, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ పరిశోధనను మరియు పరికరాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అతిరధ మహారథుల మధ్యన ఈ విద్యార్ధి వివరించినందుకుగాను ఈ అవార్డును అందుకున్నట్లు ప్రిన్సిపాల్ అన్నారు.

ఉప రాష్ట్రపతి శ్రీ.ఎం.వెంకయ్య నాయుడు ఈ విద్యార్థిని అభినందించారు.విద్యార్థికి ప్రశంస పత్రాన్ని మరియు జ్ఞాపికను అందజేశారు.మెకానికల్ రంగంలో నూతన పరిశోదన చేసిన ఈ విద్యార్థిని మరియు అధ్యాపకుడిని కళాశాల యాజమాన్యం,ప్రిన్సిపాల్ డాక్టర్.సి.యువరాజ్,విభాగాధిపతి డాక్టర్. సూర్య నారాయణ రాజు,అధ్యాపకులు మరియు విద్యార్థులు అభిందనలు తెలియజేశారు.