ఏపీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు ఆకస్మిక మరణం

0
49
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు సురేష్‌ విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి కన్న బాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేష్‌ పెద్ద తమ్ముడు.మరో సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్‌.

సురేష్‌ మృతదేహాన్ని కాకినాడకు తరలించారు.ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబును ఫోన్‌లో పరామర్శించారు.సురేశ్‌బాబు మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.