ఏపీలో ప్రారంభమైన శాసనసభ సమావేశాలు

0
205
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.ఈనెల 30 వరకు మొత్తం 14 రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.ముందుగా ప్రాజెక్టుల అంశంపై ప్రశ్నోత్తరాల సమ యంలో అధికార,ప్రతిపక్షాల మధ్య వాదనలు జరిగాయి.ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభో త్సవానికి సీఎం జగన్‌ ఎందుకు వెళ్లారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు.

దీనిపై సీఎం వై.ఎస్‌.జగన్‌ స్పందిస్తూ నేను వెళ్లినా వెళ్లకపోయినా వాళ్లు ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కర్ణా టకలోని ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుకుంటూ పోతే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.

అంత ఎత్తుకు పెంచుకుంటూ పోతే మనకు నీళ్లు ఎలా వస్తాయో కనీసం ఆలోచించారా అని విమ ర్శించారు.తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలని సీఎం జగన్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ గోదావరికి నాసిక్‌,ఇంద్రావతి,శబరి పాయలున్నాయి.కేవలం మన రాష్ట్రంలో ఉన్న గోదావరి పాయ శబరి మాత్రమే.

కేవలం 500 టీఎంసీల నీరు మాత్రమే శబరిపాయ నుంచి గోదావరికి వస్తోంది. కృష్ణ, గోదావరి జలాలను అనుసంధానించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించ దగ్గవని సీఎం జగన్‌ అన్నారు.పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే చూస్తూనే ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్ప డింది. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్‌ చెప్పారు.