ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వర్షం అడ్డంకి – మ్యాచ్‌ నేడు కొనసాగింపు

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌లో మాంచెస్టర్‌ వేదికకగా తొలిసెమీఫైనల్లో తలపడిన భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వరు ణుడు అడ్డంకిగా మారాడు.భారీ వర్షం కారణంగా రిజర్వుడే అయిన నేటికి మ్యాచ్‌ వాయిదా పడింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగు స్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది.

అదికాస్త భారీ వర్షంగా మారడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది.దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌(67 నాటౌట్‌), లాథమ్‌(3 నాటౌట్‌ )లు ఉన్నారు.నేటి ఆట మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో మొదలవుతుంది.

ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ రోజే మ్యాచ్‌ ముగించాలని అంపైర్లు భావించారు.వీలు కుదిరితే ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నించారు.అయితే వర్షం వస్తూ పోతుండటంతో మ్యాచ్‌ కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు రిజర్వ్‌డేకు వాయిదా వేశారు.రిజర్వ్‌డే రోజు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లీసేన ఫైనల్‌ చేరుకుంటుంది.