త్వరలో బిజెపిలో టిడిపి విలీనం – జె.సి బ్రదర్స్ సంచలన వ్యాఖ్యలు

0
356
advertisment

మనఛానల్ న్యూస్ – పొలిటికల్ న్యూస్ డెస్క్
ఏపిలో తెలుగుదేశంపార్టీ అంతరించి పోనుందా…అంటే అవునని అంటున్నారు జెసి బ్రదర్స్ …ఈ విషయంపై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి మాజీ ఎం.ఎల్.ఏ జె.సి ప్రభాకర్ రెడ్డి. త్వరలో ఏపిలో తెలుగుదేశం పార్టీ బిజెపిలో విలీనం కాబోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని, బిజెపికి చంద్రబాబు ఐడియాలు ఎంతో అవసరమైనందున తప్పక బిజెపిలోకి ప్రవేశించరావల్సి వస్తోందని అన్నారు. తాము కూడ తల వంచి బిజెపితో తాళికట్టించుకొని కాపురం చేయనున్నామని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు.తప్పని సరి పరిస్థితులో టిడిపి బిజెపిలో చేరక తప్పదని అన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రధాన నేతలు ఇంకా స్పందించలేదు.