అమెరికాలో వర్ష బీభత్సం – జల దిగ్బంధంలో పలు నగరాలు

0
129
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
వర్ష బీభత్సానికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది.ఈ వర్ష ధాటికి పలు నగరాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి.కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.రహదారులపై ఉన్న కార్లు,ఇతర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నాయి.

ముఖ్యంగా శ్వేతసౌధం (వైట్‌హౌస్‌)లోకి వరద నీరు ప్రవేశించడం విశేషం.పలు ప్రాంతాల్లోని ప్రజలు తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక సతమతమవుతున్నారు.అమెరికా సైన్యం వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు ముమ్మర సహాయక చర్యలను అందిస్తున్నది.

ఇప్పటికే 15 మందిని కాపాడారు.ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలల్లో ఇంతటి భారీవర్షాలు కురవడం ఇదే తొలిసారని వాతావరణశాఖ తెలిపింది.