వైఎస్సార్‌టీఎఫ్‌ ఆధ్వర్యంలో మదనపల్లెలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

0
100
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
ఏపీ వైఎస్సార్‌టీఎఫ్‌ ఆధ్వర్యంలో చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం స్వర్గీయ ముఖ్య మంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 70వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్‌ వైఎస్సార్‌…వైఎస్సార్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌టీఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ రైతుబాంధవుడు, పేదలపెన్నిధి, బడుగు బలహీనవర్గాల వారి ఆశాజ్యోతిగా మన్ననలు పొందిన డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు.ఆంధ్రప్రదేశ్‌లోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు. 108,ఆరోగ్య శ్రీ,రైతులకు ఉచిత విద్యుత్‌ తదితర గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి ఏపీ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారన్నారు.

తండ్రి అడుగుజాడల్లోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పయనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే జనరంజకమైన పాలనను అందించి ప్రజాప్రసంశలను అందుకుంటున్నారని కితాబిచ్చారు.ముఖ్యంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. వై.ఎస్‌.జగన్మో హన్‌రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధిస్తుందని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డి.మోహన్‌ రెడ్డి,అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ జి.రామ చంద్ర, ట్రెజరర్‌ జి.నారాయణ రెడ్డి,మండల అధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి,జనరల్‌ సెక్రటరీ కె.నాగరాజ, నిమ్మ నపల్లి మండల అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి,బి.కొత్తకోట సభ్యులు చేశారు. రాజశేఖర్‌, సి.ఎం.రెడ్డి, వాల్మీకిపురం రమణ,బాలాజీ,పుంగనూరు రామచంద్ర,రామసముద్రం వెంకటరమణ,తంబళ్లపల్లి జి.వి. ప్రసాద్‌ మరియు గోపాల్‌,రమణారెడ్డి,ప్రసాద్‌ రెడ్డి,ఎం.నారాయణ రెడ్డి,పీఎస్‌ సుశీల,కె.మోహన్‌ రెడ్డి, అమరనాథ్‌,జిమ్సన్‌ రమణ,మల్లేశ్వర తదితరులు పాల్గొన్నారు.