మదనపల్లె జిల్లా కోసం బి.కొత్తకోటలో భారీ మానవహారం

0
69
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలంటూ చిత్తూరుజిల్లా బి.కొత్తకోట పట్టణంలో మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ మానవహారాన్ని నిర్వహించారు.శనివారం స్థానిక జ్యోతిచౌక్‌ వద్ద జరిగిన ఈ మానవహారంలో అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లెకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తించి ఈ క్షణమే మదనపల్లెను జిల్లా కేంద్రం ప్రకటిస్తే అన్ని వనరులు సమకూరుతాయన్నారు.ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్నిభవనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.అదేవిధంగా బ్రిటీష్‌ వారి హయాంలో,టిప్పు సుల్తాన్‌ పరిపాలనలో మరియు క్రైస్తవమత పెద్దల సేవలో మదనపల్లె కీలక పాలనా కేంద్రం అవతరించిందన్నారు.

ఇందుకు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం,డీఎస్‌పి బంగ్లా,బీసెంట్‌ థియోసాపికల్‌ కళాశాల (బి.టి.కళాశాల), జామియా మసీదు,పెద్ద చర్చిలే నిదర్శమన్నారు.మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని పీలేరు, పుంగనూరు, మదనపల్లె,తంబళ్లపల్లి నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష అని దీనికి అనుగుణంగానే ప్రజలు రోడ్లపైకి వచ్చి వారి కాంక్షను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారన్నారు.

ఈ మానవహారంలో సిపిఐ నాయకులు ఎస్‌.మనోహర్‌ రెడ్డి, మదనపల్లె జిల్లా సాధన సమితి సభ్యులు రఘునాథ రెడ్డి, జంగాల శివరాం,కరీముల్లాలతోపాటు కె.రవీంద్ర,చక్కిలాల బాబు,ఎస్‌.బషీర్‌ ఖాన్‌, వై. రఘునాథ రెడ్డి,మేడా రాఘవ,జి.రఘునాథ్‌,నక్కా మహేష్‌,కాంతారావు,కంచి బలరాం రెడ్డి, ప్రభాకర్‌, జె.నారాయణ మూర్తి,ఎస్‌.వెంకట్రమణ

ఎస్‌.మహమ్మద్‌ ఖాసీం,సింగన్న,సి.బాలు,మున్నా,కెకెపల్లి కృష్ణా రెడ్డి,దశరథ,ఎం.అష్రప్‌ అల్లి,నగేష్‌, నరసింహులు మరియు చైతన్య,మధుర మీనాక్షి,సుంకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని ప్రజాసంఘాలు నాయకులు పాల్గొన్నారు.