నిజామాబాద్‌లో విషాదం – నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

0
50
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నిజామాబాద్‌
నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాదకర సంఘటన నిజామాబాద్‌ నగర శివారు ప్రాంతమైన నాగారంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే నాగారం ఏజీ క్వార్టర్స్‌కు సమీపంలోని ఉర్దూ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం నమాజ్‌కని బయటకు వెళ్లారు.

ఆ తర్వాత వారు తిరిగి పాఠశాలకు చేరుకోలేదు.ఇవాళ ఉదయం కుంటలో శవమై తేలారు.స్నానం చేసేందుకు కుంటలోకి దిగి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.బాలుర మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులను మహ్మద్ అజార్ (మూడో తరగతి), ఆర్బాజ్ ఖాన్(మూడో తరగతి), సలీం(నాలుగో తరగతి)లుగా పోలీసులు గుర్తించారు.