కివీస్‌పై ఇంగ్లాండ్‌ ఘనవిజయం – ప్రపంచకప్‌ సెమీస్‌లో ప్రవేశం

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు అద్భుత ఆటతీరుతో చెరేగింది.బుధవారం రాత్రి ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఇంగ్లండ్‌ సగర్వంగా నాకౌట్‌లోకి ప్రవే శించింది.1992 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఇంగ్లండ్‌ నిర్దేశించిన 306 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది.లక్ష్యఛేదనలో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు.టామ్‌ లాథమ్‌(57; 65 బంతుల్లో 5 ఫోర్లు)మినహా ఎవరూ రాణించలేకపోయారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లతో చెలరేగగా వోక్స్‌, రషీద్‌, స్టోక్స్‌, ఫ్లంకెట్‌, ఆర్చర్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్‌కు మంచి స్కోర్‌ అందించిన బెయిర్‌ స్టోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.భారీ ఛేదనలో కివీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మున్రో(0), గప్టిల్‌(8)లు మరోసారి విఫలమవడంతో కివీస్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అనంతరం సీనియర్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే దురదృష్టవశాత్తు విలియమ్సన్‌(27), టేలర్‌(28)లు స్వల్ప వ్యవధిలో ఇద్దరూ రనౌట్‌ కావడం కివీస్‌ కొంపముంచింది.అనంతరం ఏ దశలోనూ కివీస్‌ విజయంవైపు పయనించలేదు.లాథమ్‌ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు.నీషమ్‌(9), గ్రాండ్‌హోమ్‌(3)లు పూర్తిగా నిరాశపరిచారు.దీంతో కివీస్‌ కనీసం 200 పరుగులు కూడా దాటలేకపోయంది.దీంతో భారీ ఓటమి చవిచూసింది.

అంతకుముందు ఓపెనర్‌ బెయిర్‌ స్టో (106;99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌) విధ్వంసానికి తోడు జేసన్‌ రాయ్‌(60; 61 బంతుల్లో 8ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.సారథి ఇయాన్‌ మోర్గాన్‌(42) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బౌల్ట్‌,నీషమ్‌‌,హెన్రీలు తలో రెండు వికెట్ల పడగొట్టగా సౌథీ, సాంట్నర్‌లు చెరో వికెట్‌ దక్కించుకున్నారు.