ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటున్న అందాల తార శ్రుతిహాసన్‌

0
66
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
దాదాపు రెండేళ్లపాటు సినిమాకి దూరమైంది అందాల తార శ్రుతిహాసన్‌.దీంతో ఆమె పెళ్లిచేసుకుంటారని పలు వదంతులు వినిపించాయి.మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణంలో ప‌డ్డ త‌ర్వాత శృతి ఆయ‌న‌ తో స‌ర‌దాగా చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ షికార్లు చేసింది. ఇటీవ‌ల వీరిద్దరి ప్రేమ‌కి ఎండ్ కార్డ్ ప‌డింది.

దీంతో మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి సారించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది.అదీ కాక అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది.అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు.ఢిల్లీలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ ర‌హ‌స్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం.

నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కి బంధించిన ప్రిప‌ రేష‌న్‌లో ఉంద‌ట శృతి. అయితే తాజాగా ఈ అమ్మ‌డిని ఓ నెటిజ‌న్ పెళ్లెప్పుడు చేసుకుంటారు, అదె ప్పుడో చెబితే అభిమానుల‌మైన మేమంతా పాల్గొంటామన్నాడు. దీనిపై స్పందించిన శృతి వివాహానికి చాలా రోజుల స‌మ‌యం ఉంది. బ‌ర్త్‌డేకి రండి అంద‌రి క‌లిసి క‌ట్టుగా జ‌రుపుకుందాం అని బ‌దులిచ్చింది.