బోల్తా పడ్డ ట్రావెల్స్ బస్సు – 25 మందికి గాయాలు

0
225

మనఛానల్‌ న్యూస్‌ – విజయనగరం
ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది గాయడిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.

జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందినవారు కాశీయాత్ర ముంగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. తోటపల్లి ఎడవకాలువ వద్దకు రాగానే వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 20 మంది యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాజువాకకు చెందిన గౌరీ శంకర్ ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదానికి గురైంది.