ఉగాదికి ప్రతి పేదకుటుంబానికి ఇంటి స్థలం – గృహ నిర్మాణశాఖ సమీక్షలో సి.ఎం.వై.ఎస్ జగన్ వెల్లడి

0
233

మనచానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో వై.ఎస్.జగన్ నేతృత్వంలో ఏర్పాటు అయిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకొంది. గృహ నిర్మాణ శాఖపై సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ప్రకటించారు. వచ్చే ఉగాధి నాటికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 1.5 సెంట్ల విస్తీర్ణంలో ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్లు లేని పేదవారు ఉండరాదని అన్నారు. ఇంటి స్థలాన్ని మహిళల పేరిట రిజిష్ట్రర్ చేసి ఇవ్వాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పేదలు వాయిదాల పద్దతిలో కట్టే విధానాన్ని తమ ప్రభుత్వం సమర్థించదని అన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవనీతికి స్థానం లేదన్నారు. అధికారుల పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.