టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ – కొత్త కొత్త జె.ఈ.ఓగా బసంత్ కుమార్

0
370

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమ
తిరుమ తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.శ్రీనివాసరాజును జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఆయన స్థానంలో ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ వైస్‌ చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బసంత్‌ కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. బసంత్‌ కుమార్‌ తక్షణం బాధ్యతలు చేపట్టాలని ఆదే శాలు ఇవ్వడం జరిగింది.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా శ్రీనివాసరాజు ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ సేవలందించడం విశేషం.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో శ్రీనివాసరాజు టీటీడీ జేఈవోగా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.