నేడు జరగాల్సిన తెలుగు రాష్ట్రాల అధికారుల సమావేశం రద్దు

0
37
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
విభజన సమస్యలు, నదీజలాల వినియోగంపై ప్రగతిభవన్‌లో నేడు జరగాల్సిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధికారుల సమావేశం రద్దయింది.దీనిపై ఏపీ అధికారులు మాట్లాడుతూ వచ్చే నెల రెండో వారంలో మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించ నున్నట్లు తెలిపారు.

అవసరమైతే మరో 10 రోజుల్లోపు ఇరు రాష్ట్రాల అధికారులు తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమవు తామన్నారు. వచ్చే నెలలో జరిగే ముఖ్యమంత్రులు సమావేశంలో విభజన సమస్యలు, నదీజలాల వినియోగం, ఆంధ్రభవన్‌ తదితర అంశాలు ఒక కొలిక్కి అవకావముందన్నారు. నిన్న జరిగిన సమా వేశం ఎంతో చారిత్రాత్మకమైనది.

ఈ సమావేశంలో ఆద్యంతం అద్భుతంగా సాగిందన్నారు.అర్థరాత్రి వరకు జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రులకు వివరిస్తామని అధికారులు తెలిపారు.ఇటువంటి చర్చల ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల కు ఎంతో ఉపయుక్తంగా ఉండడమే కాకుండా రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతాయని వారు ధీమా వ్యక్తం చేశారు.