తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్‌ రాజీనామా యోచన

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేసే యోచనలో
ఉన్నారు. రాహుల్‌గాంధీ స్ఫూర్తితోనే తాను రాజీనామా చేస్తానని రేవంత్‌ వివరించారు.

కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానన్నారు. అదేవిధంగా శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

ఇందులో రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామో దర రాజనర్సింహా,మల్లు భట్టివిక్రమార్కఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.త్వరలో రాష్ట్రంలో జరిగే మునిసిపల్‌ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.