తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

0
75
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌, కేసీఆర్‌లు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

సీఎం జగన్‌తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు,బుగ్గన రాజేంద్రనాథ్‌, పేర్ని నాని,బాలినేని శ్రీనివాసులు రెడ్డి,అనిల్‌కుమార్‌ యాదవ్‌ చర్చల్లో పాల్గొంటున్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ సలహాదారులు,ఉన్నతాధికారులు అజేయ కల్లం,సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్‌దాస్‌, ఎస్‌ఎస్‌ రావత్‌లతోపాటు 24 మంది ఈ సమావేశానికి వచ్చారు.

తెలంగాణ తరపున కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్‌,నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ చర్చల కు హాజరయ్యారు.తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఫోరం సభ్యులను కూడా ఈ భేటీకి ఆహ్వానించారు. సాయం త్రం వరకు సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్‌ ఉద్యోగుల విభజన,

విద్యుత్‌ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు,రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్‌–9,10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.