స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

0
69
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. బుధవారం 2 శాతం క్రూడ్‌ ధరలు పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం (జూన్ 27) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పెరిగాయి.

పెట్రోల్ లీటరుకు 7పైసలు, డీజిల్ ధర లీటరుకు 5-6 పైసలు పెరిగాయి. ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ స​మాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర బుధవారం రూ.70.05 వద్ద ఉండగా డీజిల్ ధర రూ.63.95గా ఉంది. మరోవైపు గురువారం అంతర్జాతీయ చమురు మార్కెట్లో, ముడి ధరలు తగ్గు ముఖం పట్టాయి.

రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. జి20 శిఖరాగ్ర సమావేశం, ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తిదారుల సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు( ఫ్యూచర్స్ )బ్యారెల్‌కు 0.3శాతం క్షీణించి 66.30 డాలర్లుగా ఉంది