విజయనిర్మల మృతదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చుతున్న హీరో కృష్ణ

0
218
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
ప్రముఖ సినీ నటి, గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన మహిళ దర్శకురాలు విజయనిర్మల మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేసింది. ఆమె 40 పైబడి సినిమాలకు దర్శకత్వం వహించారు.విజయనిర్మల మరణాన్ని ఆమె భర్త సినీ హిరో కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతదేహం ముందు కూర్చోని వెక్కి వెక్కి ఏడ్చుతున్నారు. దీనిని చూస్తున్న బంధువులు అభిమానులు చలించి పోతున్నారు. ఆయన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి పక్కనే కూర్చొని ఓదార్చుతున్నారు. ఆమె స్వంత కుమారుడు నరేష్ కూడ తల్లి మృతదేహం ముందు విషణ్ణ వధనంతో ఉన్నారు.విజయనిర్మల పార్థివదేహన్ని చూడడానికి వచ్చిన అభిమానులు, శ్రేయూభిలాషులు,బంధుమిత్రులు ఆమె కుమారుడు నరేష్ ను ఓదార్చుతున్నారు. విజయనిర్మల అంత్యక్రియలు రేపు (శుక్రవారం)హైదరబాద్ లో జరుగుతాయి.