రేపు విజయనిర్మల అంత్యక్రియలు

0
74
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, ప్రముఖ సినీనటి,దర్శకురాలు విజయనిర్మల(73) అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గురువారం ఆమె స్వగృహంలో అభిమానులు, బంధు మిత్రుల సందర్శనానికి ఉంచి శుక్రవారం ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు.అక్కడ కొంత సేపుఉంచి అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.