నూతన అసెంబ్లీ భవనానికి భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్‌

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు భూమి పూజ చేశారు.ఎర్ర‌మంజిల్‌లో నూత‌న అసెంబ్లీని నిర్మించ‌నున్నారు. శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. వేద పండితులు మంత్రోచ్ఛ‌ర‌ణ చేశారు.

సీఎం కేసీఆర్ గ‌డ్డ‌పార‌తో పునాది తొవ్వి కొబ్బ‌రికాయ,గుమ్మ‌డికాయ కూడా కొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొబ్బ‌రికాయ‌లు కొట్టారు. మంత్రులు మెహ‌మూద్ అలీ, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఈటెల రాజేంద‌ర్‌, త‌లసాని శ్రీనివాస్, ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్‌ విద్యాసాగ‌ర్ రావు, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావులు

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హ‌రీశ్ రావు, బాల‌రాజు, జీవ‌న్‌రెడ్డి, రాజ‌య్య‌, ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.ప్ర‌స్తుతం నాంప‌ల్లిలో ఉన్న అసెంబ్లీ హాల్‌ను హెరిటేజ్ భ‌వ‌నంగా సంర‌క్షించ‌నున్నారు.ఎర్ర‌మంజిల్‌లో అసెంబ్లీ, మండ‌లి కాంప్లె క్సుల‌ను సుమారు 100 కోట్ల‌తో నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే.