తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి సి.ఎం.కె.సి.ఆర్ చే శంకుస్థాపన

0
253


మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయానికి గురువారం ఉదయం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చేతుల మీదుగా ప్రత్యేక పూజల నడుమ ఈకార్యక్రమం ఘనంగా జరిగింది. పండితుల వేద మంత్రాల మధ్య కె.సి.ఆర్. ఆయన మంత్రి వర్గ సహచరులు ,శాసనసభ్యులు, పార్టీ నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. సుమారు రూ.400 కోట్లతో ఈ సచివాలయాన్ని నిర్మిస్తున్నారు.