కామారెడ్డిజిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం – ముగ్గురు దుర్మరణం

0
130
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ వెనుక నుంచి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డీజిల్ ట్యాంకర్ పేలి పూర్తిగా దగ్ధమైంది.

కారు తుక్కుతుక్కయి మృతదేహాలు పూర్తిగా నలిగిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న చిన్నారి అభి రాం, అభిరాం తండ్రి రాకేశ్ మాత్రం మృత్యుంజయులుగా నిలిచారు.చిన్నారి తల్లి, అమ్మమ్మ, మేన మామలు మృతి చెందారు.చిన్నారిని, రాకేశ్‌ను బయటకు తీసిన స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారు నెంబర్ టీఎస్ 08 ఈబీ 1445లో హైదరాబాద్ నుంచి బాసరకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.మృతులు వనస్థలిపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు.