ఈనెల 28న ఏపీలో ఏబివిపి ఆధ్వర్యంలో పాఠశాలల బంద్‌

0
171
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఈనెల 28న పాఠశాలల రాష్ట్రవ్యాప్త బంద్‌కు అఖిల భారత పరిషత్‌ (ఏబివిపి). దీనిపై చిత్తూరుజిల్లా వసతిగృహాల కన్వీనర్‌ ఎ.అయ్యప్ప రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

ముఖ్యంగా పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించడం,ప్రభుత్వ నిబంధనలను అన్ని పాఠశాలలు పాటించడం,ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను విక్రయించడం సమస్యలపై ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు మంగళవారం నిర్వహించిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

ఈ బంద్‌కు అన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమం లో ఏబివిపి నాయకులు సందీప్‌,భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.