మదనపల్లిలోని మిట్స్ కాలేజీని సూక్ష్మ, చిన్న మద్యతరహా పరిశ్రమల సంస్థ ప్రతినిధులు

0
31
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి లోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీని హైదరబాద్ కు చెందిన కేంద్రప్రభుత్వ రంగ సంస్థ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట్రప్రెసెస్(MSME) డెవలప్ మెంట్ శిక్షణ సంస్థ ప్రతినిధులు సందర్శించినట్లు సోమవారం మిట్స్ కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సంస్థకు చెందిన అడిషనల్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ డి. చంద్ర శేఖర్, మరియు అసిస్టెంట్ డైరెక్టర్
కె.సి. చౌదరిలు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల లో బిజినెస్ ఇంక్యూబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి కావలసిన వసతులను మరియు సౌకర్యాలను పరిశీలించామని వారు తెలిపారు.ఈసందర్భంగా వారు కళలశాల లోని విద్యార్థులతోను మరియు వివిధ విభాగాధిపతులతో ముఖాముఖి నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. విద్యార్థులను వ్యాపార వేత్తలుగా తీర్చి దిద్దుటకు ఈ ఇంక్యూబేషన్ ఎంతగానో ఉపయోగపడుతున్నదని వారు అన్నారు. స్వచ్ భారత్ కార్యక్రమం లో భాగంగా కళశాల ప్రాంగణం లో ఎం.ఎస్.ఎం.ఇ ప్రతినిధులు మొక్కలను నాటారు. కార్యక్రమం లో కళాశాల విభాగాధిపతుల తో పాటు డైరెక్టర్ ఆర్&డి డాక్టర్. ప్రసాద్, డాక్టర్ తులసి రామ్ నాయుడు, డాక్టర్ ముజాహిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.