చిత్తూరులో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం – సమస్యల పరిష్కారానికి డి.ఇ.ఓకు వినతి పత్రం

0
344

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లావిద్యాశాఖ, సంగ్ర శిక్షా అభియాన్ ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘూల సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలు సంక్షిప్తంగా..

 • అమ్మఒడిని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపు చేయాలి. విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించరాదు.
 • డి.ఎస్.సి నియమాకాలు టీచర్ల బదలీలు, పదోన్నతుల అనంతరమే చేపట్టాలి.
 • ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనల మేరకు నిర్వహించడానికి కమిటి ఏర్పాటు చేయాలి.
 • పాఠశాల పారిశుద్ధ్య కార్మీకుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి.
 • బదిలీలు, పదోన్నతులు కౌన్సిలింగ్ విదానంలో నిర్వహించాలి.
 • ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎంల పదోన్నతుల విషయంలో సమన్యాయం పాటించాలి.
 • హెచ్.ఎం.ల పదోన్నతికి సీనియారీటి స్కూల్ అసిస్టెంట్ల జాబితా ప్రకటించాలి.
 • సర్వశిక్ష అభియాన్ లో జరుగుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ లో పారదర్శకత తీసుకురావాలి. ఇప్పటికే జరిగిన నియామకాల విధానం భయటపెట్టాలి. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలి.
 • పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చొరవ తీసుకోవాలి.
 • గత కౌన్సిలింగ్ లో ఖాళీలను సర్దుబాట్లు చేశారు. వారికి శాశ్వత స్థానాలుగా వాటినే గుర్తించాలి.
  ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం పట్ల ఎస్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి సి.పురుషోత్తం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ సంఘాల నేతలు చిత్తూరు జిల్లా విద్యా శాఖ అధికారి పాండురంగశర్మకు వినతి పత్రం సమర్పించారు.