ఎన్.సి.సి.కేడట్లకుసామాజిక స్పృహ ఆవశ్యకం – లెప్టినెంట్ కల్నల్ కైలాష్ చంద్ర

0
32
advertisment

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
ఎన్.సి.సి. కేడట్లకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక స్పృహ ఎంతో ఆవశ్యకమని 35 ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి కమాండింగ్ ఆఫీసర్ లెప్టినెంట్ కల్నల్ కైలాష్ చంద్ర అన్నారు. చిత్తూరు లోని స్థానిక పి.వి.కె.ఎవ్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణ శిబిరాన్ని
సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎన్.సి.సి విభాగం వారు నిర్వహించిన ప్రకృతి వైపరిత్యాల సమయంలో ఎన్.సి.సి. కేడట్ల పాత్ర అనే అంశంపై లెప్టినెంట్ కల్నల్ కైలాష్ చంద్ర ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్.సి.సి.కేడట్లు మెుక్కల నాటడంతో పర్యావరణ పరిరక్షణ, రక్తదానం చేయడం, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గోనడం వంటి అంశాలపై చురుకుగా పాల్గోనడడం అభినందనీయమన్నారు. ప్రజలలో సైతం ఇలాంటి విషయాలపై చైతన్యం తీసుకు రావడం వల్ల సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు డిప్యూ టి కమాండెంట్ కల్నల్ లక్ష్మీనారాయణ, సుభేదార్ మేజర్ గూరంగ్, అసోసియేట్ ఎన్.సి.సి అధికారులు ప్రాసాద్ రెడ్డి, గంటామెహన్,చాణక్యుడు, చంద్రశేఖర్ రెడ్డి, వాసుదేవన్, తాజ్ ఖాన్, విజయ్, గిరిజ, ఎన్.సి.సి శిక్షకులు త్రిలోక్ రెడ్డి, సుబ్బారెడ్డి, రజాక్ ఆలీ, ఓంవీర్ సింగ్, రామ్ నివాస్, చోగ్లే, సూపరిండెంట్ సరోజ, కరీముల్లా, వెంకటేష్, ప్రియ సెల్వం, యాదవ్ తదితరులు పాల్గోన్నారు.