ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పదవికి విరాల్‌ ఆచార్య రాజీనామా

0
62

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ పదవికి విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. ఐదుగురు డిప్యూటీ గవర్నర్లలో విరాల్‌ ఆచార్య ఒకడు.అయితే మరో ఆరు నెలల పదవీకాలం ఉన్నప్ప టికీ ఆయన తన బాధ్యతల నుంచి వైదొలిగారు.

జనవరి 23, 2017న విరాల్‌ ఆర్బీఐలో చేరారు.ఆర్థిక సరళీకరణ విధానాల అమలు తర్వాత ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్లలో అత్యంత పిన్న వయస్కుడు విరాల్‌ కావడం విశేషం.ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించి నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.తిరిగి ఆయన గతంలో పనిచేసిన న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా వెళుతున్నట్లు సమాచారం.

ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని గట్టిగా వినిపించిన వ్యక్తి విరాల్‌ ఆచార్య. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని అప్పట్లో వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు అప్ప ట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి.